ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు
Breaking News
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
Published on Fri, 10/13/2023 - 07:54
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు.
ఇతర విశేషాలు...
- ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
- సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది.
- ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు.
సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి
#
Tags : 1