Breaking News

కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో

Published on Fri, 05/12/2023 - 14:55

ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా జిపిఎస్ నావిగేషన్‌కి సపోర్ట్ చేసే ఏదైనా పరికరం ఉండే చాలు. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సార్లు ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఇటీవల వెల్లడైన ఒక వీడియో హవాయిలోని హోనోకోహౌ హార్బర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కారు ఏకంగా సముద్రపు నీటిలోకి దూసుకెళ్లడం, అందులో ఒక మహిళ ఉండటం చూడవచ్చు. అయితే చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ కారు నీటిలోకి వెళ్లడం వల్ల అందులో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

ఇందులో కనిపించే కారుని డ్రైవ్ చేస్తున్న మహిళ జిపిఎస్ నమ్ముకుని కారుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అక్కడ సమీపంలో ఉన్న కొంత మంది ఈ సంఘటన గమనించి ఆమెను రక్షించారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు.

(ఇదీ చదవండి: రూ. 2.5 కోట్ల ఉద్యోగం వద్దనుకున్నాడు.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ - ఎవరీ కన్హయ శర్మ?)

గతంలో ఒక వ్యక్తి జిపిఎస్ నమ్ముకుని అడవిలో చిక్కుకుని నానా అగచాట్లు పడ్డాడు. ఇంకో సంఘటనలో కొంత మంది ప్రాణాలే కోల్పోయారు. కావున జిపిఎస్ అన్ని వేళలా గమ్యాన్ని చేరుస్తాయని నమ్ముకోకూడదు, కావున కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆలా కాకుండా సొంత తెలివితేటలు నమ్ముకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)