amp pages | Sakshi

సంచలనం..అదిరిపోయే డిజైన్‌లతో ఓలా ఎలక్ట్రిక్‌ కారు.. ఎలా ఉందో మీరే చూడండి!

Published on Mon, 06/20/2022 - 15:15

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లతో ఆటోమొబైల్‌ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్‌ హచ్‌ బ్యాక్‌ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

ఓలా అధినేత భవిష్ అగర్వాల్ రైడ్‌ షేరింగ్‌ రంగం నుంచి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంపై కన్నేశారు. ఇప్పటికే టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసిన భవిష్‌..భారీ మొత్తంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా త్రీ వేరియంట్‌ కార్ల ఫస్ట్‌ టీజర్‌లను ఇటీవల నిర్వహించిన కస్టమర్‌ డే ఈవెంట్‌లో రివిల్‌ చేశారు. ఆ టీజర్‌ ఫోటోలు ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా..ఆగస్ట్‌ 15న ఓలా ఆ కార్లకు సంబంధించి పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా.. ఆ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు వెలుగులోకి వచ్చాయి.

ఆ వివరాల ప్రకారం..ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఓలా కార్లు ఎస్‌యూవీ, హచ్‌బ్యాక్‌, సెడాన్‌ ఇలా మూడు వేరియంట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కూపీ మోడల్‌, లో సంగ్ల్‌ స్టాన్స్‌,మజిలర్‌ బాడీ, స్టీప్‌ రూఫ్‌లైన్‌ స్పెసిఫికేషన్‌లు ఉండగా..ఒక కారు మాత్రం అప్‌ రేర్‌ ఎండ్‌, యూ షేప్‌డ్‌ ఆకారంలో టెయిల్‌ ల్యాప్‌ డిజైన్‌లు ఉన్నాయి.

ఇక స్పోర్ట్స్‌ హచ్‌ బ్యాక్‌లో స్టబీ ఫ్రంట్‌ ప్రొఫైల్‌ డిజైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విడుదలైన ఈ టీజర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ కారు స్పోర్టీ డిజైన్‌, షార్ప్‌ ఎడ్జ్‌లు,రెండు షేడ్‌లతో మూడు కార్లు దర్శనమిస్తున్నాయి.

ఈ డిజైన్‌లతో పాటు..సెడాన్‌ వేరియంట్‌లలో ఓలా అటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీపై వర్క్‌ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!

Videos

రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..

శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..

తెలుగు ఓటర్లు కీలకం

కడుపు మంటతోనే టీడీపీ దాడులు

ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR

"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)