Breaking News

హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 ఫొటోలు విడుదల

Published on Sun, 06/11/2023 - 20:18

అమెరికన్‌ టూవీలర్‌ కంపెనీ హార్లే డేవిడ్సన్ బైక్‌లంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్‌ ఉంది.  అత్యంత ఖరీదైన ఈ బైక్‌లను భారత్‌లోనూ చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్‌440 (Harley-Davidson X440) ఫొటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో భారత్‌లో వీటిని అభివృద్ధి చేసి తయారు చేయడం విశేషం.

కంపెనీ విడుదల చేసిన కొత్త ఫొటోల ఆధారంగా హార్లే డేవిడ్సన్ ఎక్స్‌440 ఇంజిన్‌, డిజైన్‌, హార్డ్‌వేర్‌కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయో నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

ఇంజిన్ 
ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 440సీసీ ఇంజన్‌ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోటార్‌తో ఇది పోటీపడుతుంది. తరువాతి పవర్ ఫిగర్‌లు 20.2బీహెచ్‌పీ, 27ఎన్‌ఎం టార్క్. హార్లే-డేవిడ్సన్ 440సీసీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించనప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సమానమైన అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

డిజైన్ 
హార్లే డేవిడ్సన్ XR డిజైన్ ఎథోస్ నుంచి ప్రేరణ పొందిన ఎక్స్‌440 అనేది రోడ్‌స్టర్ అంటే ఇది ఫ్లాట్, విశాలమైన హ్యాండిల్‌బార్‌తో రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది. పాదాల పెగ్‌లు క్రూయిజర్ లాగా ముందుకు, వెనుకకు కదిలే వీలు ఉండదు కాబట్టి సీటింగ్ స్థానం తటస్థంగా ఉంటుంది. సరళమైన గుండ్రని ఆకారపు ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వృత్తాకార ఇండికేటర్లు, అద్దాలు ఉంటాయి. స్లిమ్‌గా రూపొందించిన చతురస్రాకారపు ఇంధన ట్యాంక్‌పై హార్లే డేవిడ్‌సన్ ఎక్స్‌440 ట్యాగ్‌ ఉంటుంది. 

హార్డ్‌వేర్
కొత్త ఎక్స్‌440 రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్,  ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్‌లతో వస్తుంది.  ఎంఆర్‌ఎఫ్‌ టైర్లతో 18 అంగుళాల ఫ్రంట్ వీల్,  17 అంగుళాల రియర్‌ ఉంటాయి.  అలాగే సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. 

ధర
బజాజ్ ట్రయంఫ్ 400, హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440  రెండు మోటార్‌సైకిళ్లూ పోటాపోటీగా వస్తున్నాయి.  జులైలో వీటిని ఆయా కంపెనీలు మార్కెట్‌కు పరిచయం చేయనున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి పోటీగా వస్తున్న హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉండవచ్చు.

ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)