Breaking News

హ్యాపీ ఫోర్జింగ్స్‌ @ రూ. 808–850

Published on Fri, 12/15/2023 - 06:05

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఈ నెల 19న పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.

ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్‌మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్‌ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్‌ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్‌ఎం, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు, టాటా కమిన్స్‌ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)