Breaking News

జీఎస్‌టీ స్లాబ్‌ల్లో మార్పులు..!

Published on Fri, 08/23/2024 - 07:10

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి స్లాబ్‌ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.

ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్‌టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్‌ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 54వ అత్యున్నత స్థాయి  సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.

జీవోఎం కన్వీనర్‌గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్‌టీ పన్ను స్లాబ్‌లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్‌టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్‌ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్‌ను విధిస్తున్నారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)