జీఎస్‌టీ వసూళ్లు 15% జూమ్‌

Published on Wed, 09/02/2026 - 04:17

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు్టలో 14.8 శాతం జంప్‌చేసి, రూ. 1,99,853 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశీ లావాదేవీలు, దిగుమతులు దీనికి దోహదం చేశాయి. పశ్చిమాసియా సంక్షోభ ప్రతికూలతలు, టారిఫ్‌ అడ్డంకులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యేందుకు దేశీ వినియోగమే దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, దేశీ లావాదేవీల నుంచి జీఎస్‌టీ ఆదాయం 9.3 శాతం ఎగసి రూ. 1.37 లక్షల కోట్లను తాకగా.. దిగుమతుల నుంచి ఆదాయం 29 శాతం దూసుకెళ్లి రూ.62,604 కోట్లుగా నమోదైంది. 

ఆగస్టులో స్థూల కేంద్ర జీఎస్‌టీ వసూళ్లు రూ.38,413 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర జీఎస్‌టీ 46,316 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.1,15 లక్షల కోట్లకు చేరుకుంది. 
రిఫండ్లు 68 శాతం పెరుగుదలతో రూ. 31,795 కోట్లుగా నమోదయ్యాయి. 
నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1,68 లక్షల కోట్లు. 8.3 శాతం వృద్ధి చెందాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌–ఆగస్టు ఐదు నెలల కాలంలో జీఎస్‌టీ ఆదాయం 11% ఎగబాకి రూ.10.43 లక్షల కోట్లను తాకింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లలో నిలకడకు ఇది అద్దం పడుతోంది. 
దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు జీఎస్‌టీ వసూళ్లే నిదర్శమని ఈవై ఇండియా ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం మరింత పెరుగుతుందని, ఈ దన్నుతో వచ్చే రెండు నెలల్లో పన్ను వసూళ్లు మరింత పుంజుకుంటాయని ఆయన చెప్పారు.
 

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)