Breaking News

జీఎస్‌టీ సంస్కరణలు వృద్ధిని బలపరుస్తాయ్‌ 

Published on Thu, 10/02/2025 - 05:09

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్‌టీ తాజా సంస్కరణలు సానుకూల ప్రభావం చూపిస్తాయని ఆర్‌బీఐ బులెటిన్‌ అభిప్రాయపడింది. వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని, రిటైల్‌ ధరలు దిగొస్తాయని, వినియోగం బలపడుతుందని పేర్కొంది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు ఏర్పడినట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో (క్యూ1) జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరి తన బలాన్ని చాటినట్టు పేర్కొంది. 

రిటైల్‌ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా పెరిగినప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యానికంటే ఎంతో దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవస్థలో లిక్విడిటీ (నగదు లభ్యత) మిగులు ఉన్నట్టు తెలిపింది. క్యూ1లో కరెంట్‌ ఖాతా లోటు గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మోస్తరు స్థాయికి చేరినట్టు, సేవల ఎగుమతులు బలంగా ఉండడం, రెమిటెన్స్‌లు (విదేశాల నుంచి నగదు బదిలీలు) ఇందుకు సాయపడినట్టు బులెటిన్‌లో పేర్కొంది. 

జీఎస్‌టీ తాజా సంస్కరణలు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, జీఎస్‌టీలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని, పన్ను నిబంధనల అమలును పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ల నుంచి 45 శాతం ఎగుమతులకు మినహాయింపు కల్పించడాన్ని ప్రస్తావించింది. సుంకాల ప్రభావం రంగాలవారీగా ఉండొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు బలంగా ఉండడాన్ని గుర్తు చేసింది. తయారీ, సేవల రంగాల పనితీరు దశాబ్ద గరిష్టానికి చేరినట్టు తెలిపింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)