సిబ్బంది సేవలపై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధి పెంపు

Published on Sat, 04/05/2025 - 21:46

సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి. కాంట్రాక్ట్‌ సిబ్బంది వంటి మెరిట్‌ ఆధారిత సేవలపై వస్తువులు  సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం అటువంటి ఒక సంస్కరణ అని స్పష్టం చేస్తోంది.

కాంట్రాక్ట్‌ సిబ్బంది, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌  సెక్యూరిటీ సర్వీసెస్‌ వంటి లేబర్‌–ఇంటెన్సివ్‌ సెక్టార్‌లు ఉపాధిని సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి, మిలియన్ల మందికి స్థిరమైన ఉద్యోగాలను అందిస్తూ వ్యాపారాలకు ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే, ఈ వీటికి ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి అదే జీఎస్టీ. సిబ్బంది సేవలపై 18% వస్తు సేవల పన్ను (జిఎస్టీ)  సంస్థలు ఉద్యోగులను అధికారికంగా నియమించుకోకుండా ఉండేందుకు కారణమవుతోంది. తద్వారాకార్మిక చట్టాలకి కట్టుబడి ఉండకుండా  సామాజిక భద్రతా ప్రయోజనాలు అనధికారిక నియామక పద్ధతులను అవి ఎంచుకోవడానికి దారి తీస్తోంది.

ఈ జీఎస్టీ రేటును 5 శాతానికికి తగ్గించడం వలన నియామక ఖర్చులు తగ్గుతాయి.. అంతేకాకుండా ఇది అధికారిక ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎస్‌ఎమ్‌ఇలు) ప్రభావంతంగా పనిచేసేందుకు ఆర్థిక వృద్ధికి దారితీస్తూ మరింత  దోహదం చేస్తుంది. ఈ మార్పు ఉద్యోగ కల్పనకు, ఉపాధిని క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను నిజాయితీగా పాటించడానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. వ్యాపారాలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది, మరింత నిర్మాణాత్మకమైన  జవాబుదారీతనం గల లేబర్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది.

భారత స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ లోహిత్‌ భాటియా అభిప్రాయం ప్రకారం,. కాంట్రాక్టు సిబ్బంది సేవలపై జీఎస్టీ రేటును తగ్గించడం అనే సంస్కరణ ద్వారా అనధికారిక రంగంలోని కార్మికులు సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు  మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రయోజనాలు పొందుతారు.  ఈ సంస్కరణ భారతదేశంలో  విస్తృత దృష్టితో స్థిరమైన  సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంది. ఆర్థిక వృద్ధి  కార్మికుల హక్కులతో సమతుల్యం అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)