Breaking News

జీఎస్‌టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ

Published on Tue, 09/24/2024 - 08:21

జీఎస్‌టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. బీహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్‌టీ కౌన్సిల్‌కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.

కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్‌ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్‌టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది. 

ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్‌!
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)