Breaking News

జీఎస్‌టీ వసూళ్లు డీలా

Published on Tue, 12/02/2025 - 06:28

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం ఏడాది కనిష్టానికి పడిపోయింది. నవంబర్‌లో రూ.1,70,276 కోట్లు జీఎస్‌టీ రూపంలో వసూలైంది. 2024 నవంబర్‌లో ఆదాయం రూ.1.69 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 0.7 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్‌లో మాత్రం స్థూల జీఎస్‌టీ వసూళ్లు అంతక్రితం ఏడాది ఇదే నెలతో (రూ.1.87 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 4.6 శాతం అధికంగా రూ.1.95 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం తెలిసిందే. జీఎస్‌టీలో శ్లాబులను కుదించడంతోపాటు, 375 వరకు ఉత్పత్తులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చడం తెలిసిందే. 

కొత్త రేట్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్‌లో మెరుగైన ఆదాయానికి పండుగల సమయంలో కొనుగోళ్లు దోహదపడినట్టు, నవంబర్‌ నెల గణాంకాల్లో రేట్ల సవరణ ప్రభావం కనిపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు జీఎస్‌టీ వసూళ్లు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 8.9 శాతం పెరిగి రూ.14,75,488 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లు 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లను మినహాయించి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)