Breaking News

జీఎస్టీలో కీలక మార్పులు.. నవంబర్ 1 నుంచి రీఫండ్లకు కొత్త విధానం!

Published on Mon, 10/26/2026 - 14:09

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో వ్యాపారులకు అనుకూలంగా పలు కీలక సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. పన్ను రిటర్నుల్లో తప్పులు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలో వ్యత్యాసాలు, రీఫండ్ల జాప్యం వంటి సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్టోబర్ 8న జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మార్పులకు సిఫార్సులు చేశారు. చట్ట సవరణలు అవసరం లేని సంస్కరణలను నవంబర్ 1, 2026 నుంచి దశలవారీగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చట్ట సవరణలు అవసరమైన మార్పులను ఏప్రిల్ 1, 2027 నాటికి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

రిటర్న్ ఫారాల్లో మార్పులు..

జీఎస్టీఆర్-1, జీఎస్టీఆర్-1ఏ, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ (ఐఎఫ్‌ఎఫ్‌) ఫారాల్లో ప్రతిపాదిత మార్పుల ముసాయిదాలను నవంబర్ 1న మైగవ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబర్ 30 వరకు వాటిపై అభిప్రాయాలు తెలియజేయవచ్చు. సవరించిన ఫారాలను ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.

ఏటా రిటర్న్.. మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు

చిన్న వ్యాపారులకు అనుసరణ భారం తగ్గించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ మరో కీలక ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లలోపు ఉండి, వినియోగదారులకు నేరుగా వస్తువులు లేదా సేవలను విక్రయించే (బి2సి) అర్హత కలిగిన వ్యాపారాలు కొత్త ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ విధానంలో ఏడాదికి ఒకసారి రిటర్న్ దాఖలు చేసి, ప్రతి త్రైమాసికానికి పన్ను చెల్లించే అవకాశం కల్పించనున్నారు.

ఆలస్య రుసుములో ఊరట

రిటర్న్ దాఖలులో ఆలస్యమయ్యే చిన్న పన్ను చెల్లింపుదారులకు కూడా ఉపశమనం కల్పించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు, నిర్ణీత గడువు దాటినా అదే క్యాలెండర్ నెలాఖరులోగా సంబంధిత రిటర్న్ దాఖలు చేస్తే ఆలస్య రుసుము మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఆటోమేటిక్ జీఎస్టీ రీఫండ్లు..

జీఎస్టీ రీఫండ్ల కోసం ఎదురుచూసే వ్యాపారాలకు ఊరట కల్పించేలా ఆటోమెటిక్‌ రీఫండ్ మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. వర్తించే కేసుల్లో నవంబర్ 1 తర్వాత వచ్చే కొత్త రీఫండ్ క్లెయిమ్‌లకు ఈ విధానం వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాత క్లెయిమ్‌లకు ఈ సదుపాయం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ-కామర్స్ విక్రేతలకు కొత్త అవకాశం

ఆన్‌లైన్ వేదికల ద్వారా వస్తువులను విక్రయించే చిన్న వ్యాపారులకు ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కొత్త సదుపాయాన్ని కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. అర్హత కలిగిన విక్రేతలు తాము భౌతికంగా కార్యకలాపాలు నిర్వహించని రాష్ట్రాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన గిడ్డంగిని తమ ప్రధాన వ్యాపార స్థలంగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది.

అరెస్టు నిబంధనలు, ప్రాసిక్యూషన్ పరిమితుల్లో మార్పులు

జీఎస్టీ చట్టంలో సవరణలు అవసరమయ్యే కొన్ని కీలక మార్పులను ఏప్రిల్ 1, 2027 నాటికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో అరెస్టుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, ప్రాసిక్యూషన్‌కు వర్తించే పరిమితుల పెంపు, ఈ-వే బిల్లుల నిబంధనల్లో సవరణలు ఉన్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ప్రకారం, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఆర్థిక పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచడం, సాధారణ జరిమానాను రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. షోకాజ్ నోటీసులకు కనీస పరిమితిని రూ.10,000గా నిర్ణయించే అంశం కూడా పరిశీలనలో ఉంది.

నకిలీ ఇన్‌వాయిస్‌లకు చెక్..

నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే విధానాలను అడ్డుకోవడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇన్‌వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయనున్నారు.

జీఎస్టీ రేట్లు తగ్గుతాయా?

ఈసారి జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పన్ను విధానాల సరళీకరణ, రిటర్నుల సయోధ్య, రీఫండ్లు, రిజిస్ట్రేషన్లు వంటి ప్రక్రియలపైనే దృష్టి పెట్టారు. కొత్తగా జీఎస్టీ రేట్ల మార్పులను ప్రకటించలేదు. రేట్లకు సంబంధించిన అంశాలను భవిష్యత్తులో జరిగే సమావేశంలో ప్రత్యేకంగా పరిశీలించే అవకాశం ఉంది. తదుపరి సమావేశ తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)