Breaking News

భారత్‌లో క్యాన్సర్‌ ఔషధాలు ప్రారంభించిన జీఎస్‌కే

Published on Mon, 08/25/2025 - 14:25

భారతదేశంలో తన ఆంకాలజీ ఔషధాలను ప్రారంభిస్తున్నట్లు జీఎస్‌కే కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారతీయ మహిళల్లో పెరుగుతున్న ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్లను పరిష్కరించడానికి జెంపెర్లి (డోస్టార్లిమాబ్), జెజులా (నిరాపారిబ్)లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది.

జెంపెర్లి.. ఇమ్యునోథెరపీ

డీఎంఎంఆర్ / ఎంఎస్ఐ-హెచ్ అధునాతన ఎండోమెట్రియల్ క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశంలో మొదటగా ఆమోదించబడిన పీడీ-1 ఇమ్యునోథెరపీగా గుర్తించబడింది. ఇది గార్నెట్ ట్రయల్ ఆధారంగా 45.5% ప్రతిస్పందన రేటు నమోదు చేసింది. 24 నెలల వరకు స్థిరమైన ప్రయోజనాలను చూపించినట్లు కంపెనీ తెలిపింది. ఇది క్యాన్సర్‌ చికిత్సలో కీమోథెరపీకి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

జెజులా.. అండాశయ క్యాన్సర్‌ ఔషధం

ఇది బయోమార్కర్ విధానాల్లో మోనోథెరపీ నిర్వహణ కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక రోజువారీ పీఏఆర్‌పీ ఇన్‌హిబిటర్ చికిత్స. అధిక-ప్రమాదం ఉన్న రోగుల్లో ఉపశమనాన్ని అందించడానికి ప్రైమా ట్రయల్‌లో మెరుగైన ఫలితాలు అందించింది.

ఇదీ చదవండి: యూఎస్‌లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?

2045 నాటికి భారతదేశంలో ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ కేసులు వరుసగా 78%, 69% పెరుగుతాయని అంచనా. మహిళల క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన రోగులకు జీఎస్‌కే అందిస్తున్న చికిత్సలు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ పేర్కొంది. రోగులకు సహాయం అందించేందుకు జీఎస్‌కే ‘ఫీనిక్స్’ అనే పేషెంట్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఈ చికిత్సలు కీలకంగా మారుతాయని జీఎస్‌కే ఇండియా ఎండీ భూషణ్ అక్షికర్ అన్నారు. జెంపెర్లి, జెజులా గైనకాలజికల్ క్యాన్సర్‌ చికిత్సకు ఎంతో తోడ్పడుతాయని చెప్పారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)