Breaking News

వేదాంతా విడదీతకు ఓకే

Published on Wed, 12/17/2025 - 02:10

ముంబై: ప్రైవేటు రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ బిజినెస్‌ల విడదీత ప్రణాళికకు తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పింది. దీంతో వివిధ బిజినెస్‌ విభాగాలను రంగాలవారీగా ఐదు స్వతంత్ర కంపెనీలుగా విడదీసేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. కంపెనీ విడదీత పథకానికి ట్రిబ్యునల్‌ ముంబై బెంచ్‌ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఐరన్‌ అండ్‌ స్టీల్, విద్యుత్‌ తదితర బిజినెస్‌లను విడిగా లిస్ట్‌ చేయనుంది. కాగా.. నవంబర్‌లో విచారణ తదుపరి బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్‌సీఎల్‌టీ అనుమతి వేదాంతా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలక మైలురాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తాజా అనుమతితో విడదీత పథక అమలుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2023లోనే వేదాంతా బిజినెస్‌ల విడదీత ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా వేదాంతా పేరుతో అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పవర్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌తోపాటు.. పునర్వ్యవస్థీకరించిన వేదాంతా లిమిటెడ్‌గా ఐదు కంపెనీలకు తెరతీయనుంది. వేదాంతా లిమిటెడ్‌లో జింక్, సిల్వర్‌ బిజినెస్‌లు కొనసాగనున్నాయి. తాజా అనుమతితో వేదాంతా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% జంప్‌చేసి రూ. 573 వద్ద ముగిసింది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)