Breaking News

ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ రూ.1,000 కోట్లు సమీకరణ

Published on Wed, 12/25/2024 - 08:49

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహన తయారీ కంపెనీ గ్రీవ్స్‌(Greaves) ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.

మరో 18.9 కోట్ల షేర్లను ప్రమోటర్‌ సంస్థ, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ప్రమోటర్‌ గ్రీవ్స్‌ కాటన్‌ 5.1 కోట్ల షేర్లను, ఏఎల్‌జే గ్రీన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ డీఎంసీసీ 13.8 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి. కంపెనీ యాంపియర్‌ బ్రాండుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు(EV Scooters), మరో బ్రాండుతో త్రిచక్ర ఈవీలను రూపొందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.375 కోట్లు బెంగళూరు టెక్నాలజీ కేంద్రంలో ప్రొడక్ట్, సాంకేతిక అభివృద్ధికి, రూ.83 కోట్లు సొంత బ్యాటరీ అసెంబ్లీ సామర్థ్యాలకు, రూ.38 కోట్లు ఎంఎల్‌ఆర్‌ ఆటో తయారీ సామర్థ్య పెంపునకు, బెస్ట్‌వే ఏజెన్సీస్‌ ప్రయివేట్‌ తయారీ విస్తరణకు మరో రూ.20 కోట్లు చొప్పున వెచ్చించనుంది.

ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మంది

కంపెనీ తెలంగాణ(తూప్రాన్‌), తమిళనాడు(రాణీపేట్‌), ఉత్తరప్రదేశ్‌(గ్రేటర్‌ నోయిడా)లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. గతేడాది(2023–24) రూ.612 కోట్ల ఆదాయం సాధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)