న్యూ ఇయర్‌ వేడుకల కోసం భారతీయుల అరాచకం.. ఏం చేశారంటే?

Published on Wed, 01/01/2025 - 17:10

ఢిల్లీ : కొత్త ఏడాది 2025 సందర్భంగా ఆన్‌లైన్‌ అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. డిసెంబర్‌ 31 రోజున ద్రాక్ష నుంచి కండోమ్స్‌ వరకు.. చిప్స్‌ ప్యాకెట్ల నుండి హ్యాండ్‌కఫ్‌ల వరకు కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టారని ఫాస్ట్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్‌తో పాటు ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు ఆన్‌లైన్‌ అమ్మకాల రిపోర్ట్‌ను విడుదల చేశాయి.  

తమ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు మంగళవారం సాయంత్రం 8 గంటల వరకు చిప్స్, కోక్, నామ్‌కీన్‌లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.  రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లను కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు.  39 శాతం చాక్లెట్ ఫ్లేవర్ కండోమ్ విక్రయించగా.. స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్‌గమ్ 19 శాతం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.  

 

 నిన్న కస్టమర్లు ద్రాక్ష పండ్లను ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌ పెట్టడంపై దిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ద్రాక్ష పండుకు ఇంత క్రేజ్ ఏంటి? ఉదయం నుండి ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులలో ఇదొకటి!’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అదే సమయంలో మంగళవారం సాయంత్రం 7:30ల వరకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్‌లను, బ్లైండ్‌ఫోల్డ్స్, హ్యాండ్‌కఫ్‌లను డెలివరీ చేసింది. 7:41కి ఐస్‌ క్యూబ్స్‌ ఊహించని స్థాయిలో ఆర్డర్‌లు వచ్చాయని, కేవలం నిమిషం వ్యవధిలో 119 కిలోలు ఐస్‌ క్యూబ్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కోఫౌండర్‌ ఫణి కిషన్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  

బిగ్‌బాస్కెట్‌లో కూల్‌డ్రింగ్స్‌ ఆర్డర్‌లు 552 శాతానికి చేరుకున్నాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం, పచ్చిక కార్పెట్‌, మాక్ టెయిల్ విక్రయాలు 200 శాతం పెరిగాయి.

 

న్యూఇయర్‌లో జరిగిన ఆన్‌లైన్‌ అమ్మకాలతో కోవిడ్‌-19 రాకతో వినియోగదారుల అభిరుచి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్విక్‌ కామర్స్‌ సంస్థల రాకతో సంప్రదాయ ఆఫ్‌లైన్‌ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టింది. నిమిషాల్లో డెలివరీతో బిజినెస్‌ స్ట్రాటజీ మెట్రో నగరాలను దాటి టైర్-2, టైర్-3 నగరాలకు పాకింది. ఫలితంగా వినియోగదారులు ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్లు తాజాగా, క్విక్‌ కామర్స్‌ డెలివరీ రిపోర్ట్‌లతో తేలింది.

Videos

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)