Breaking News

అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..

Published on Tue, 11/26/2024 - 08:35

అదానీ గ్రూప్‌పై అమెరికాలో నమోదైన లంచాల ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్, ఫ్రాన్స్‌ ఇంధన రంగ దిగ్గజం టోటల్‌ ఎనర్జీస్‌ తాజాగా స్పందించాయి. గతేడాది యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తదుపరి అదానీ గ్రూప్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ భారీగా ఇన్వెస్ట్‌ చేసింది. టోటల్‌ ఎనర్జీస్‌ అదానీ గ్రూప్‌తో భాగస్వామ్య కంపెనీని కలిగి ఉంది. కాగా.. అదానీ గ్రూప్‌లోని తమ పెట్టుబడులన్నీ అత్యంత లాభదాయకంగా ఉన్నట్లు జీక్యూజీ తెలియజేసింది. యూఎస్‌లో కేవలం వ్యక్తులపైనే లంచాల ఆరోపణలు నమోదైనట్లు ప్రస్తావించింది.

తాము పెట్టుబడులు చేపట్టిన అదానీ గ్రూప్‌ పటిష్టంగానే ఉన్నట్లు జీక్యూజీ పేర్కొంది. విడిగా గ్రూప్‌ కంపెనీల బిజినెస్‌ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌లో జీక్యూజీ 8 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. అంతక్రితం వాల్‌మార్ట్, ఒరాకిల్, సీమెన్స్, ఫైజర్, హనీవెల్‌ తదితర పలు గ్లోబల్‌ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌లపై సైతం వివిధ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

పెట్టుబడుల నిలిపివేత

మరోవైపు అదానీ గ్రూప్‌ అత్యున్నత అధికారులపై లంచాల ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ ఎనర్జీస్‌ ప్రస్తుతానికి తాజా పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అదానీ టోటల్‌ గ్యాస్‌తోపాటు అదానీ గ్రీన్‌ ఎనర్జీలోనూ ఫ్రెంచ్‌ దిగ్గజానికి పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీలోనూ టోటల్‌కు 19.75 శాతం వాటా ఉంది.

ఇదీ చదవండి: ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు

ఆర్థికంగా పటిష్టం: అదానీ గ్రూప్‌

తగినంత నగదు నిల్వలు, లాభార్జన నేపథ్యంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్లు అదానీ గ్రూప్‌ తాజాగా వెల్లడించింది. దీంతో రుణ చెల్లింపులకు సమస్యలు ఎదురుకాబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా వృద్ధి అవకాశాలకు సైతం నిధులు సరిపోతాయని తెలియజేసింది. తద్వారా ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది. కంపెనీ అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌లపై యూఎస్‌లో లంచాల ఆరోపణలు వెలువడిన కారణంగా ఇన్వెస్టర్లకు ఒక నోట్‌లో కంపెనీ ఆర్థిక పరిస్థితులను  కంపెనీవద్ద రూ.55,024 కోట్ల నగదు నిల్వలున్నాయని, ఇవి రాగల 28 నెలల్లో చేపట్టవలసిన దీర్ఘకాలిక రుణ చెల్లింపులకంటే అధికమని తెలియజేసింది. గత ఆరు నెలల్లో గ్రూప్‌ రూ.75,227 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. అయితే ఇదేసమయంలో మొత్తం రుణ భారం రూ.16,882 కోట్లు మాత్రమే పెరిగినట్లు  వెల్లడించింది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)