Breaking News

పతంజలి ఫుడ్స్‌లో జీక్యూజీ పెట్టుబడి

Published on Thu, 07/20/2023 - 06:17

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో యూఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 5.96 శాతం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ చేపట్టిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో భాగంగా 2,15,64,517 షేర్లను సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.96 శాతం వాటాకాగా.. బుధవారం షేరు ధర దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1,332.75 వద్ద ముగిసింది. ఈ ధరలో చూస్తే జీక్యూజీ పెట్టుబడి విలువ రూ. 2,900 కోట్లకు చేరింది.

కాగా.. గత వారం ఓఎఫ్‌ఎస్‌ను చేపట్టిన పతంజలి ఫుడ్స్‌ షేరుకి రూ. 1,000 ఫ్లోర్‌ ధరలో 2.53 కోట్ల షేర్ల(7 శాతం వాటా)ను ఆఫర్‌ చేసింది. తద్వారా కంపెనీలో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు మాతృ సంస్థ పతంజలి ఆయుర్వేద తెరతీసింది. దీంతో పతంజలి ఫుడ్స్‌లో పతంజలి ఆయుర్వేద వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం జూన్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌తోపాటు ఇతర విదేశీ సంస్థలు.. అదానీ గ్రూప్‌ కంపెనీలలోనూ బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)