Breaking News

అదానీలో జీక్యూజీ భారీ పెట్టుబడులు

Published on Thu, 06/29/2023 - 04:48

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ కంపెనీలలో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ తదితర పెట్టుబడి సంస్థలు తాజాగా బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 8,200 కోట్లు) ఇన్వెస్ట్‌ చేశాయి. గ్రూప్‌లోని డైవర్సిఫైడ్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో 1.6 శాతం వాటాకు సమానమైన 1.8 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయి. ఈ బాటలో అదానీ గ్రీన్‌ ఎనర్జీలోనూ 2.2 శాతం వాటాకు సమానమైన 3.52 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

స్టాక్‌ ఎక్సే్ఛంజీల సమాచారంమేరకు రెండు కంపెనీలలో బ్లాక్‌ట్రేడ్స్‌ నమోదయ్యాయి. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తదుపరి చైర్మన్‌ గౌతమ్‌ అదానీ.. గ్రూప్‌పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ముందస్తు రుణ చెల్లింపులు, నిధుల సమీకరణ తదితర చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో జీక్యూజీ పార్ట్‌నర్స్‌.. అదానీ గ్రూప్‌ కంపెనీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలలో ప్రమోటర్లు 1.87 బిలియన్‌ డాలర్ల(రూ. 15,446 కోట్లు) విలువైన వాటాలను జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు విక్రయించారు. తదుపరి మే నెలలో మరో 40–50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది.

బ్లాక్‌డీల్స్‌ ఇలా..
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో మంగళవారం ధర రూ. 2,281తో పోలిస్తే షేరుకి రూ. 2,300 ధరలో బుధవారం బీఎస్‌ఈలో లావాదేవీ నమోదైంది. అయితే అదానీ గ్రీన్‌లో ముందురోజు ధర రూ. 960తో పోలిస్తే రూ. 925–920 ధరలో బ్లాక్‌డీల్స్‌ జరిగాయి. తద్వారా రెండు కంపెనీలలోనూ విడిగా 50 కోట్ల డాలర్ల విలువైన ప్రమోటర్ల వాటాలు విదేశీ సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,404 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్‌ స్వల్ప నష్టంతో రూ. 958 వద్ద ముగిసింది. తొలుత 7 శాతం పతనంకావడం గమనార్హం! మేలో నిర్వహించిన బోర్డు సమావేశాలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 2.5 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 21,000 కోట్లు) సమీకరణకు ఆమోదించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించాలని ప్రతిపాదించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)