Breaking News

ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత: ఆర్‌బీఐ

Published on Tue, 02/24/2026 - 16:09

జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. 2026–27 బడ్జెట్‌లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఆర్‌బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్‌ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్‌బీఐ బులెటిన్‌ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)