Breaking News

త్వరలో ఈ–కామర్స్‌ ఎగుమతి హబ్‌లు

Published on Fri, 12/20/2024 - 10:46

దేశంలో ఈ–కామర్స్‌ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్‌ఎల్, లెక్స్‌షిప్‌ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్‌ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.

కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్‌ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌ అగ్రిగేటర్‌ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్‌ కంపెనీ కార్గో సర్వీస్‌ సెంటర్‌లను (సీఎస్‌సీ) ఇప్పటికే పైలట్‌ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..

2030 నాటికి ఈ–కామర్స్‌ ఎగుమతులు 100 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్‌ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్‌ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి.
 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)