Breaking News

సెమీకండక్టర్ ల్యాబ్‌ కోసం రూ.4,500 కోట్లు

Published on Sat, 11/29/2025 - 12:55

దేశంలోని ప్రభుత్వ రంగ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అయిన సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్‌సీఎల్‌)ను వచ్చే మూడేళ్లలో పూర్తిగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఎస్‌సీఎల్‌ ప్రస్తుతం అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ASICs), ఆప్టో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎంఈఎంఎస్‌ పరికరాలకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ సదుపాయం దేశంలోని ఏకైక ఇంటిగ్రేటెడ్ డివైస్ తయారీ యూనిట్‌గా గుర్తింపు పొందింది.

‘రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా ఈ రూ.4,500 కోట్ల పెట్టుబడి తోడ్పడుతుంది. ఎస్‌సీఎల్‌ ఉత్పత్తిని మూడేళ్లలో 100 రెట్లు పెంచాలి’ అని మంత్రి అన్నారు. ప్లాంట్ విస్తరణ కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్రం పంజాబ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ‘పంజాబ్ ప్రభుత్వం ఎంత త్వరగా భూమి కేటాయిస్తే అంత త్వరగా ఎస్‌సీఎల్‌ విస్తరణ పూర్తవుతుంది. ఆధునీకరణ పనుల కోసం ఇప్పటికే టెండర్లు జారీ చేశాం’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం 180 నానోమీటర్ నోడ్‌లో చిప్‌లు తయారు చేస్తున్న ఎస్‌సీఎల్‌ను స్టార్టప్‌లకు ‘టేప్ అవుట్ ఫెసిలిటీ’గా మార్చనున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)