హోటళ్లకు నోటీసులు.. కస్టమర్లదే అంతిమ నిర్ణయం!

Published on Tue, 07/21/2026 - 12:55

రెస్టారెంట్లలో బిల్లులతో పాటు అడ్డగోలుగా సర్వీస్ ఛార్జ్ పేరిట వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బిల్లులో కస్టమర్ల అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ కలపడం, దానిని తొలగించమని కోరినా నిరాకరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న 41 ప్రముఖ రెస్టారెంట్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు ప్రారంభించింది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘రెస్టారెంట్లు వినియోగదారులను సర్వీస్ ఛార్జ్ చెల్లించమని బలవంతం చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా కస్టమర్ ఆప్షన్‌’ అని స్పష్టం చేశారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్‌)కు అందిన వేలాది ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఈ చర్యలు చేపట్టింది.

కోర్టు తీర్పుతో మారిన సమీకరణాలు

వాస్తవానికి, జులై 2022లోనే సీసీపీఏ రెస్టారెంట్లలో నిర్బంధ సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని అనుచిత వ్యాపార ధోరణిగా అభివర్ణిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, రెస్టారెంట్ అసోసియేషన్లు దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. గత ఏడాది (మార్చి 2025) ఢిల్లీ హైకోర్టు సీసీపీఏ మార్గదర్శకాలను సమర్థిస్తూ తీర్పునివ్వడంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

వినియోగదారులు తెలుసుకోవాల్సినవి..

ఆహార పదార్థాలు, వాటిపై పడే పన్నులు మాత్రమే కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్ అందించే సేవ నచ్చితే టిప్ లేదా సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టం. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఉంటే దానిని తీసివేయమని అడిగే హక్కు కస్టమర్‌కు ఉంది. హోటల్ యాజమాన్యం నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం. సర్వీస్ ఛార్జ్ అనేది అధికారిక పన్ను కానందున దానిపై జీఎస్టీ విధించడం నిబంధనలకు విరుద్ధం.

ఫిర్యాదు చేయడం ఎలా?

ఒకవేళ ఏ రెస్టారెంట్ అయినా సర్వీస్ ఛార్జ్ బలవంతంగా వసూలు చేస్తే వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఎన్‌సీహెచ్‌ యాప్/పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మార్గదర్శకాల అమలు స్థాయి నుంచి ప్రత్యక్ష చర్యల దిశగా కేంద్రం వేసిన ఈ అడుగు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలవనుంది.

ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)