Breaking News

బంగారానికీ హాల్‌మార్క్‌..!

Published on Sat, 12/07/2024 - 04:41

న్యూఢిల్లీ: బంగారంతో చేసిన ఆభరణాలు, కళాకృతులకు ఇప్పటికే హాల్‌మార్క్‌ తప్పనిసరి. అయితే బంగారు కడ్డీలకూ ఇకపై హాల్‌మార్క్‌ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కంజ్యూమర్‌ అఫైర్స్‌ సెక్రటరీ నిధి ఖరే వెల్లడించారు. రత్నాలు, ఆభరణాల అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ప్రజలు నాణ్యమైన, ఖచి్చతమైన ఉత్పత్తులను పొందేలా చూడటం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

 ‘మార్కెట్‌లో వినియోగదారులకు ఎక్కు వ నమ్మకం, పారదర్శకతను హాల్‌మార్క్‌ నిర్ధారి స్తుంది. స్వర్ణకారులు వాస్తవానికి బంగారాన్ని దిగు మతి చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో వా రు పొందుతున్న, కొనుగోలు చేస్తున్న బంగారం నా ణ్యత గురించి వారికి ఖచి్చతంగా తెలియదు. కాబ ట్టి మొత్తం వ్యవస్థ ఖచి్చతత్వం కోసం, నిజా యితీ కోసం గుర్తింపు రావాలని నేను భావిస్తున్నాను’ అని వివరించారు. ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే బంగారు కడ్డీలు, బిస్కట్స్, కాయిన్స్‌కు హాల్‌మార్క్‌ తప్పనిసరి అవుతుంది.  

రెండవ అతిపెద్ద ఎగుమతిదారు.. 
ప్రపంచంలో రెండవ అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారుగా భారత్‌ నిలిచింది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాను ఈ రంగం కలిగి ఉందని నిధి వివరించారు. ‘భారత ప్రభుత్వం ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించింది. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తోంది. జెమ్స్, జువెల్లరీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మూలస్తంభం.

 ఈ రంగం ఎగుమతులు, ఉపాధి రెండింటికీ చాలా గణనీయంగా దోహదపడుతోంది’ అని నిధి ఖరే వివరించారు. అంతర్జాతీయ మా ర్కెట్లలో భారతీయ ఆభరణాలు ప్రాచుర్యం పొందేందుకు కృషి చేయాలని పరిశ్రమకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ముడిసరుకు నాణ్యతను నిర్ధారించడానికి బంగారు కడ్డీలకు తప్పనిసరిగా హాల్‌ మార్క్‌ చేయాల్సిన అవసరం ఉందని జెమ్స్, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సవ్యసాచి రే అన్నారు.  


40 కోట్లకు పైగా ఆభరణాలు.. 
2021 జూన్‌ 23 నుండి ప్రారంభమైన బంగారు ఆభరణాలు, కళాఖండాల తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ నిబంధన విజయవంతంగా అమలవుతోందని నిధి ఖరే అన్నారు. ‘40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు ప్రత్యేక హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌తో (హెచ్‌యుఐడీ) హాల్‌మార్క్‌ చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదిత నగల వ్యాపారుల సంఖ్య దాదాపు 1.95 లక్షలకు చేరింది. అసేయింగ్, హాల్‌మార్కింగ్‌ కేంద్రాల (ఏహెచ్‌సీ) సంఖ్య 1,600కి పైగా ఉంది. 

ల్యాబ్‌లో తయారైన వజ్రాలకు డిమాండ్‌ పెరుగుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం నిబంధనలను రూపొందిస్తున్నాం’ అని ఖరే చెప్పారు. భారత రత్నాలు, ఆభరణాల విపణి పరిమాణం 2023లో 44 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇది 2030 నాటికి 134 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అని ఆమె తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)