Breaking News

రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!

Published on Tue, 07/25/2023 - 17:31

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది.  ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. 

రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్‌లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు.  ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.


అంతేకాకుండా,‘ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి   ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌, అదనపు బెనిఫిట్స్‌ కూడా

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)