Breaking News

నాణ్యతా నిబంధనల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులు

Published on Mon, 01/08/2024 - 05:17

న్యూఢిల్లీ: దేశీయంగా మరిన్ని ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. 2047 నాటికి భారత్‌ సంపన్న దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) 77వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌ (క్యూసీవో) ద్వారా తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను తేవడం వల్ల వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు, సర్వీసుల లభ్యత మెరుగుపడిందని  మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 672 ఉత్పత్తులతో 156 క్యూసీవోలు జారీ అయ్యాయని, రాబోయే రోజుల్లో 2,000–2,500 ఉత్పత్తులు క్యూసీవోల పరిధిలోకి చేరతాయని ఆయన పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో ప్రభుత్వం .. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్, ఆట»ొమ్మలకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడం మొదలైన చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు.  భారత్‌ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు, సంపన్న దేశంగా ఎదిగేందుకు ఉత్పత్తులు, సరీ్వసులపరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలకు బీఐఎస్‌ ప్రచారకర్తగా మారాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీఐఎస్‌ దేశీయంగా నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని గోయల్‌ చెప్పారు. లిఫ్టులు, ఎయిర్‌ ఫిల్టర్లు, వైద్య పరికరాలు మొదలైన ఉత్పత్తుల విషయంలో భారత్‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)