Breaking News

‘పీఎల్‌ఐ పథకం విస్తరణ’... ఏ రంగానికి.. ??

Published on Wed, 06/26/2024 - 12:45

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్‌)లో పాల్గొని మాట్లాడారు.

‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్‌ మేడ్‌ ఫైబర్‌(ఎంఎంఎఫ్‌) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్‌ టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్‌ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్‌(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్‌టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్‌ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది’ అన్నారు.

ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్‌ విద్యార్థి!

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్‌టైల్స్, రీసైక్లింగ్‌పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్‌లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల పథకం(ఎస్‌ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అ​‍న్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్‌టైల్‌ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్‌టైల్ పార్కులు మంజూరయ్యాయి.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)