Breaking News

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ 

Published on Fri, 04/04/2025 - 06:06

న్యూఢిల్లీ: స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ద్వారా సంస్కరణ, ఆచరణ, పరివర్తనకు భారత్‌ సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి జితిన్‌ ప్రసాద పేర్కొన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్‌ భారత్‌గా ఆవిర్భవించడంలో సామాన్యుడు సైతం కీలక పాత్ర పోషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర, పటిష్ట ప్రభుత్వానికి ఓటు వేయడంతో దేశం ధృడంగా ఉన్నట్లు స్టార్టప్‌ మహాకుంభ్‌ సందర్భంగా వాణిజ్యం, పరిశ్రమలు, ఎల్రక్టానిక్స్, ఐటీ పరిశ్రమల సహాయ మంత్రి ప్రసాద వ్యాఖ్యా­నించారు. నూతన ఆవిష్కరణల స్టార్టప్‌ కమ్యూనిటీ, కొత్త ఆలోచనలతో ప్రధాని మోడీ లక్ష్యాలైన సంస్కరణ, ఆచరణ, పరివర్తనా భారత్‌కు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సామర్థ్యం, నైపుణ్యాలు గల భారత్‌ సవాళ్లకు సిద్ధమని ప్రపంచానికి చాటాలని సూచించారు.   

7 ట్రిలియన్‌ డాలర్లకు 
భారత్‌ 2030కల్లా భారత్‌ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలున్నట్లు స్టార్టప్‌ మహాకుంభ్‌ సందర్భంగా ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ నంబియార్‌ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం జీడీపీలో ట్రిలియన్‌ డాలర్లను సమకూర్చడం ద్వారా ఇందుకు కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. ఆవిష్కరణలతో దేశ, విదేశీ సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ రంగం ప్రాధాన్యత వహించనున్నట్లు తెలియజేశారు. దేశ భవిష్యత్‌ మార్పులలో టెక్నాలజీదే ప్రధాన పాత్రగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. డీప్‌ టెక్‌ ద్వారా హెల్త్‌కేర్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తదితర రంగాల పరివర్తనలో ఐటీ నాయకత్వం వహించనున్నట్లు అంచనా వేశారు. 2047కల్లా వికసిత్‌ భారత్‌గా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఆర్థిక వృద్ధితోపాటు.. సాంకేతిక ఆవిష్కరణలు సైతం కీలక పాత్ర పోషించనున్నట్లు వివరించారు.

గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్‌ తయారీకాదు!

స్టార్టప్‌లు హైటెక్‌పై దృష్టి పెట్టాలి 

వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు

దేశీ స్టార్టప్‌ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్‌ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్, మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్‌ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్‌ మహాకుంభ్‌ సందర్భంగా సూచించారు. నిజానికి మరింతమంది దేశీ ఇన్వెస్టర్లు స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ‘డెలివరీ బాయ్‌లతో మనం సంతోషంగా ఉన్నామా? ఇదేనా భారత్‌ భవిష్యత్‌’ అంటూ ప్రశ్నించారు. ఇది స్టార్టప్‌కాదని, ఇది ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అని వ్యాఖ్యానించారు. మరోపక్క రోబోటిక్స్, మెషీన్‌ లెర్నింగ్, 3డీ మ్యాన్యుఫాక్చరింగ్, తదుపరి తరం ఫ్యాక్టరీలు తయారవుతున్నట్లు తెలియజేశారు. కొత్త స్టార్టప్‌లు దేశ భవిష్యత్‌వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్నలాజికల్‌ వృద్ధికి స్టార్టప్‌లు దోహదపడుతున్నట్లు తెలియజేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)