Breaking News

ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దు

Published on Sun, 08/04/2024 - 13:01

మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐ కస్టమర్లకు వస్తున్న సందేశాలు చట్టబద్దమైనవి కావు. బ్యాంక్ ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా లింక్స్ లేదా యాప్స్ పైల్స్ పంపదు. కాబట్టి వస్తున్న సందేశాలకు ఎవరూ స్పందించవద్దని వెల్లడించింది.

జాగ్రత్తగా ఉండండి, ఎస్‌బీఐ రివార్డ్‌లను రీడీమ్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయమని మీకు సందేశం కూడా వచ్చిందా జాగ్రత్త ?.. అటాంటి ఫైళ్లను క్లిక్ చేయవద్దు, డౌన్​లోడ్ చేయవద్దని ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ట్వీట్ చేసింది.

సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్​లు
ప్రియమైన వాల్యూ కస్టమర్, మీ ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ.9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఎస్‌బీఐ రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజమే అని చాలామంది మోసపోతున్నారు.

ఇలాంటి సందేశాలకు మోసపోకుండా ఉండాలంటే?

  • మెసేజ్ ఎవరు పంపించారు అనే విషయాన్ని ఖచ్చితంగా ధ్రువీకరించండి. నిజంగానే బ్యాంక్ నుంచి సందేశం వచ్చిందా? అని తెలుసుకోవాలి.
  • తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటివి మానుకోవాలి.
  • మీ బ్యాంక్ నుంచి అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించినట్లయితే.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.
  • బ్యాంకుకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే లావాదేవీలను జరపండి.
  • ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత లాగిన్ వివరాలను పంచుకోవద్దు.
  • ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)