Breaking News

స్టీల్‌పై సేఫ్‌గార్డ్‌ డ్యూటీ: 200 రోజుల వరకూ 12 శాతం

Published on Tue, 04/22/2025 - 13:23

న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా ఐదు విభాగాల స్టీల్‌ ప్రొడక్టులపై సేఫ్‌గార్డ్‌ డ్యూటీకి తెరతీసింది. 200 రోజులపాటు అమలయ్యే విధంగా 12 శాతం సుంకాన్ని విధించింది. ఈ జాబితాలో హాట్‌ రోల్‌డ్‌ క్వాయిల్స్, షీట్లు, ప్లేట్లు తదితరాలున్నాయి. తద్వారా పెరుగుతున్న దిగుమతుల నుంచి దేశీ సంస్థలకు రక్షణ కలి్పంచేందుకు చర్యలు చేపట్టింది.

వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం డీజీటీఆర్‌ సలహాలమేరకు ప్రభుత్వం స్టీల్‌ దిగుమతులపై తాజా సుంకాలను విధించింది. వాణిజ్య పరిష్కారాల డైరెక్టర్‌ జనరల్‌ సూచనలమేరకు కేంద్ర ప్రభుత్వం 12 శాతం విలువ ఆధారిత ప్రొవిజనల్‌ సేఫ్‌గార్డ్‌ డ్యూటీని విధించినట్లు ఆదాయ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా సుంకాలు గడువుకంటే ముందుగా ఎత్తివేయడం లేదా మార్పులు చేపట్టడం వంటివిలేకుంటే 200 రోజులపాటు అమల్లో ఉంటాయని తెలియజేసింది.

సుంకాల పరిధిలో చేర్చిన ఐదు రకాల(విభాగాల) స్టీల్‌ ప్రొడక్టుల దిగుమతి ధరలు టన్నుకి 675 డాలర్ల నుంచి 964 డాలర్ల మధ్య నిర్ణయించింది. ఈ ధరలకంటే దిగువన దిగుమతయ్యే ప్రొడక్టులకు సేఫ్‌గార్డ్‌ డ్యూటీ వర్తించనుంది. వీటికంటే అధిక ధరలకు దిగుమతయ్యే(జాబితాలో చేర్చిన) ప్రొడక్టులపై సుంకాలు అమలుకాబోవు.

#

Tags : 1

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు