Breaking News

విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?

Published on Fri, 05/09/2025 - 09:21

ఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫేక్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఒకటే ఎయిర్‌ పోర్టుల్లోకి నో ఎంట్రీ వార్త. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశంపై నిషేధం విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.

ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ (ట్విటర్‌)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక పోస్ట్ చేసింది. "ఫేక్ న్యూస్ అలర్ట్. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఆ వార్తులు ఫేక్‌. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు" అని పేర్కొంది.

ఎయిర్‌పోర్టులకు ముందే చేరుకోవాలి
భద్రతా తనిఖీల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని పలు విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల కారణంగా, ప్రయాణానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాాశ ఎయిర్‌ లైన్స్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్పైస్ జెట్ కూడా ఇదే విధమైన అడ్వైజరీని జారీ చేసింది.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)