Breaking News

స్కూల్ టైమ్ ఫీచర్.. తల్లిదండ్రులకు వరం!

Published on Sat, 08/03/2024 - 07:28

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. పెద్దవారి విషయం పక్కన పెడితే.. పిల్లలు కూడా వీటికి అలవాటైపోతున్నారు, గంటలకొద్దీ వాటికే అతుక్కుపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి, వారికి ఫోన్ ఎంతవరకు అవసరమో.. అంతవరకు మాత్రమే ఉపయోగించేలా గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.

గూగుల్ త్వరలోనే పిల్లలు ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి 'స్కూల్ టైమ్' ఫీచర్  తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్ ఓఎస్ వాచ్‌లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఏమిటి ఈ స్కూల్ టైమ్ ఫీచర్
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, పిల్లలు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్ నుంచి పిల్లలను ఎలా దూరం చేయాలని ఆలోచించే తల్లితండ్రులకు ఇప్పుడు ఈ ఫీచర్ ఓ చక్కని పరిష్కారం అనే చెప్పాలి.

ఎలా ఉపయోగించాలి 
స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ వాచ్‌లలో స్కూల్ టైమ్ ఫీచర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫ్యామిలీ లింక్ ద్వారా తేదీ, టైమ్ వంటి వాటిని షెడ్యూల్ చేయాలి. దీని ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ నుంచి కాల్స్, మెసేజస్ అనుమతించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, అన్‌లాక్‌ కూడా చేయవచ్చు.

గూగుల్ ఈ ఫీచర్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు యూట్యూబ్ యాక్టివిటీ ఫీచర్ కూడా లాంచ్ చేయడానికి సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.

స్కూల్ టైమ్ ఫీచర్ ఉపయోగాలు
పిల్లలు తమ స్కూల్స్‌లో కూడా తరగతుల మీద దృష్టి సారించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)