Breaking News

ఎకానమీకి గూగుల్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ దన్ను

Published on Thu, 07/24/2025 - 05:54

న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధికి గూగుల్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ కూడా ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నట్లు రీసెర్చ్‌ కన్సల్టెన్సీ సంస్థ పబ్లిక్‌ ఫస్ట్‌ తెలిపింది. 2024లో యాప్‌ పబ్లిషర్లకు, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఇవి సుమారు రూ. 4 లక్షల కోట్ల మేర ఆదాయ ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్‌ ఎకానమీల్లో భారత్‌ కూడా ఒకటని పబ్లిక్‌ ఫస్ట్‌ ఒక నివేదికలో వివరించింది. 

స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరగడం, డేటా చౌకగా లభిస్తుండటం, డెవలపర్లు.. ఎంట్రప్రెన్యూర్లకు అనువైన పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొంది. రిపోర్టు ప్రకారం గూగుల్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ యాప్‌ వ్యవస్థ దాదాపు ముప్పైఅయిదు లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. 

గూగుల్‌ ప్లేలో నమోదు చేసుకున్న యాక్టివ్‌ డెవలపర్లకు సంబంధించి 10 లక్షల డెవలపర్‌ జాబ్స్‌తో భారత్‌ రెండో స్థానంలో ఉంది. సుమారు 79% మంది యాప్‌ డెవలపర్లకు విదేశీ యూజర్లు ఉన్నారు. ప్లే స్టోర్‌ నుంచి భారతీయ డెవలపర్ల యాప్‌ల డౌన్‌లోడ్‌లు 720 కోట్లుగా ఉండగా, ఇందులో దేశీ యూజర్ల డౌన్‌లోడ్‌లు 600 కోట్లు, విదేశీ యూజర్ల డౌన్‌లోడ్‌లు 120 కోట్లుగా నమోదయ్యాయి.  ఆండ్రాయిడ్‌ సర్వీసులకు సంబంధించి గూగుల్‌ ప్లే అధికారిక యాప్‌ స్టోర్‌.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)