Breaking News

గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌: స్విచ్ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు

Published on Thu, 08/22/2024 - 17:19

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.

యూఎస్‌బీ-సీ డిస్​ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది
కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు యూఎస్‌బీ-సీ డిస్​ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్​బీ-సీ ద్వారా డిస్​ప్లే పోర్ట్​తో స్క్రీన్​ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.

స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు
సాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.

బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్
ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్‌ఫోన్‌కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)