Breaking News

మే 15 నుంచి ‘గూగుల్‌ ఫొటోస్‌’లో మార్పులు

Published on Thu, 04/11/2024 - 15:17

మొబైల్‌ కొనేముందు ర్యామ్‌, ఇంటర్నల్‌ మెమెరీ, స్క్రీన్‌ సైజ్‌తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు ఇంటర్నల్‌గా ఫోన్ కెమెరా టూల్‌లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్‌ ఫోటోస్‌’ యాప్‌లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్‌ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

గూగుల్‌ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్‌ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌తోపాటు ఫోటో బ్లర్‌, పోట్రైట్‌ లైట్‌ వంటి ఇతర ఏఐ టూల్స్‌ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్‌ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్‌ను కొన్ని మొబైల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్‌ టూల్స్‌ను గూగుల్‌ ఫొటోస్‌ వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’

యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం  ఆండ్రాయిడ్‌ 8.0, ఐఓఎస్‌ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్‌లనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్‌ ర్యామ్‌ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)