Breaking News

‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..

Published on Sat, 12/20/2025 - 09:31

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పే, ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ‘గూగుల్ పే ఫ్లెక్స్’ (Google Pay Flex) క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. రూపే నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ కార్డ్ వినియోగదారులకు నేరుగా యూపీఐ ఎకోసిస్టమ్‌ ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇండియాలో ఇలాంటి కార్డు అందులోబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.

యూపీఐ సౌలభ్యం..

ప్రస్తుతం భారత్‌లో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయ్యాయి. క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించి చెల్లింపులు చేసే వెసులుబాటును ఈ కొత్త కార్డ్ మరింత సులభతరం చేస్తోంది. ప్రజలు ప్రతిరోజూ చేసే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేకతలు ఇవే..

  • ఈ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

  • ఇందులో ఒక పాయింట్ ఒక రూపాయి నిష్పత్తిలో ఉంటుంది.

  • పాయింట్ల రెడీమ్‌ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా గూగుల్ పే ద్వారా తక్షణమే రీడీమ్ చేసుకోవచ్చు.

  • ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా గూగుల్ పే యాప్‌లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆమోదం పొందిన నిమిషాల్లోనే వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.

  • పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను వినియోగదారులు తమ గూగుల్ పే డాష్‌బోర్డ్ నుంచే నేరుగా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.

  • కార్డును బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం, పిన్ మార్చుకోవడం లేదా ఖర్చు పరిమితులను సెట్ చేసుకోవడం వంటివన్నీ గూగుల్ పే యాప్ నుంచే నిర్వహించవచ్చు.

ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ‘మారుతున్న భారతీయుల డిజిటల్ ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించాం. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ నైపుణ్యం, గూగుల్ పే సాంకేతికత కలిసి వినియోగదారులకు భద్రతను, సౌకర్యాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.

భద్రతకు పెద్ద పీట

భౌతిక కార్డులు పోతాయనే భయం లేకుండా ఈ ‘డిజిటల్-ఫస్ట్’ డిజైన్ భద్రతను పెంచుతుంది. గూగుల్ పే లో ఉండే బహుళ స్థాయుల ఆథెంటికేషన్‌ కారణంగా లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రూపే నెట్‌వర్క్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు వ్యాపారుల వద్ద కూడా ఈ కార్డును స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఎక్కువగా వాడే తరాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ఈ ‘ఫ్లెక్స్’ కార్డ్ క్రెడిట్ కార్డుల వాడకాన్ని మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రారంభంలో ఆశావాహం.. సవాళ్ల సుడిగుండం!

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు