Breaking News

గూగుల్‌ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!

Published on Fri, 02/21/2025 - 15:54

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.

గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్‌ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్‌ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులు

అదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్‌ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)