Breaking News

డ్రైవింగ్‌ సమయంలో.. ఏ నావిగేషన్ యాప్ బెస్ట్?

Published on Mon, 08/03/2026 - 19:44

ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలంటే.. దారిలో కనిపించినవాళ్లను అడిగి తెలుసుకుని వెళ్లేవారు. కానీ పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. దీంతో న్యావిగేషన్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే మ్యాప్స్ యాప్స్.. ఇప్పుడు ట్రాఫిక్‌ను తప్పించుకోవడం, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కథనంలో డ్రైవింగ్ సమయంలో ఏ యాప్ ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలోనూ.. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి యాపిల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, వేజ్ (Waze) వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ మ్యాప్స్
యాపిల్ పరికరాలను ఉపయోగించేవారికి యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. ఇవి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యాప్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో డిజైన్, స్పష్టమైన రూట్ వివరాలు మొదలైనవి ఉన్నాయి.

ఐఫోన్, యాపిల్ వాచ్ వంటి డివైజ్‌లతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రయాణ సమయంను ఇతరులతో షేర్ చేయడం, కారును పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, వివిధ యాపిల్ పరికరాల్లో రూట్‌లను సింక్ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అయితే రూట్‌లను ఎక్కువగా కస్టమైజ్ చేయడం, ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించడం వంటి విషయాల్లో దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

వేజ్ (Waze)
ట్రాఫిక్ సమస్యలను ముందుగానే తెలుసుకోవాలనుకునే వారికి వేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు, రోడ్ బ్లాక్‌లు, పోలీస్ చెకింగ్ వంటి సమాచారాన్ని ఇది అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని సమాచారం ఎక్కువగా యూజర్ల నుంచి వస్తుంది. అంటే.. ఒక ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలను అక్కడి డ్రైవర్లు వెంటనే తెలియజేస్తారు. దీంతో మిగతా వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వెజ్ వినియోగం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమాచారం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. వినియోగదారులు దీనిని గుర్తుంచుకోవాలి.

గూగుల్ మ్యాప్స్
గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉపయోగించే నావిగేషన్ యాప్‌లలో ఇది ప్రధానమైనది. ఈ యాప్ దారి చూపడానికి మాత్రమే కాకుండా.. ప్రయాణానికి అవసరమైన అనేక ఫీచర్లను అందిస్తుంది.

ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, టోల్ రోడ్లను తప్పించడం, తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గాలను సూచించడం, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ప్రయాణించే వారికి కూడా గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఏ యాప్‌ను ఎంచుకోవాలి?
మీరు పూర్తిగా యాపిల్ ఎకోసిస్టమ్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. రోజువారీ ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటే వేజ్ ఉపయోగపడుతుంది. ఎక్కువ ఫీచర్లు, నమ్మకమైన రూటింగ్, ఆఫ్‌లైన్ సదుపాయాలు కావాలంటే గూగుల్ మ్యాప్స్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అందరికీ సరిపోయే ఒకే ఒక్క బెస్ట్ నావిగేషన్ యాప్ ఉండదు. కాబట్టి ప్రయాణ అవసరాలు, డ్రైవింగ్ చేసే ప్రాంతం, కావాల్సిన సదుపాయాల ఆధారంగా సరైన యాప్‌ను ఎంచుకుంటే ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)