రూ.3.4 కోట్ల జాబ్‌ మానేసింది.. ‘ఉద్యోగం ఓకే కానీ..’

Published on Thu, 10/09/2025 - 22:06

టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగం.. భారీ వేతనం అయినా అన్నీ వదిలేసిందో ఓ ఉద్యోగిని. గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్, ఏడానికి రూ. 3.40 కోట్లు (390,000 డాలర్లు) సంపాదించేవారు. అయినప్పటికీ, ఎక్కువ సమయం తన ప్రియమైన వారితో గడపాలని ఆకాంక్షతో ఆమె ఉద్యోగాన్ని వీడి, జీవితాన్ని మెల్లగా ఆస్వాదించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

"పని మంచిగా అనిపించేది కానీ జీవితం ఇంకా గొప్పది" అని ఫ్లోరెన్స్ చెబుతారు. ఆమె 37 ఏళ్ల వయసులో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. బర్న్ అవుట్ కాకపోయినా, జీవితం అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి పెరిగింది. తన జీవిత భాగస్వామి జాన్ (తన కంటే 17 ఏళ్లు పెద్దవాడు, అతను కూడా గూగుల్‌ ఉద్యోగే)తో గడిపే సమయం చాలా విలువైనదని ఆమె గుర్తించారు.

2024 నాటికి 1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.6 కోట్లు) ఆదా చేసిన ఫ్లోరెన్స్, FIRE (Financial Independence, Retire Early) భావనతో ప్రేరితమై, ఉద్యోగం మానేసి 18 నెలల "మినీ రిటైర్మెంట్" తీసుకుంది. ఈ సమయంలో ఆమె జాన్‌తో కలిసి ప్రయాణాలు చేస్తూ, జీవితాన్ని తానే నిర్ణయించే వేగంతో అనుభవిస్తున్నారు.

ఇప్పుడు ఆమె జ్యూరిచ్ సరస్సులో ఈత కొడుతూ, కెరీర్ కోచింగ్ అందిస్తూ, జీవితం యొక్క అందాన్ని ఆస్వాదిస్తోంది. 

"జీవితం చిన్నది, అందమైనది. దానిని మీరు ప్రేమించే వ్యక్తులతో గడపడంమే నిజమైన ఆనందం" అని ఫ్లోరెన్స్ తేల్చి చెప్పింది.

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)