Breaking News

వేల కోట్ల రూపాయల ఫైన్‌!

Published on Wed, 09/11/2024 - 12:05

లండన్‌: యూరోపియన్‌ కమిషన్‌ విధించిన 2.4 బిలియన్‌ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్‌ చేస్తూ గూగుల్‌ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్‌ సెర్చ్‌లో గూగుల్‌ సొంతంగా షాపింగ్‌ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్‌ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో  యూరోపియన్‌ కమిషన్‌ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్‌ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్‌ యూనియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ తాజాగా సమర్థించింది.

గూగుల్‌ ఈ అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్‌ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్‌ కమిషన్‌ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్‌ సెర్చ్‌ లిస్టింగ్‌లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, యాడ్‌సెన్స్‌ అడ్వర్టైజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్‌ కేసుల్లోనూ గూగుల్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్‌కు గూగుల్‌కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.

ఇదీ చదవండి: పీపీఎఫ్‌ ఖాతాలు క్లోజ్‌ చేయాల్సిందేనా..?

ఇదిలాఉండగా, గూగుల్‌లో యాడ్‌ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్‌లకు సంబంధించిన బిడ్‌ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్‌లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్‌ కీవర్డ్‌లకు అనుగుణంగా యాడ్స్‌ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్‌ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్‌ డిస్‌ప్లే అవుతుంటాయి. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో సెర్చ్‌ యాడ్స్‌, డిస్‌ప్లే యాడ్స్‌, వీడియో యాడ్స్‌, షాపింగ్‌ యాడ్స్‌.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)