Breaking News

నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్‌

Published on Tue, 05/28/2024 - 11:32

బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్‌ స్థలానికి గూగుల్‌ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.

మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్‌ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.

గూగుల్‌ కనెక్ట్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్‌లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్‌లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్‌ను కలిగి ఉంది.

ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’

గూగుల్‌ తన ఉత్పత్తులను భారత్‌లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
 

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)