Breaking News

అందరికీ గూగుల్‌ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి

Published on Sun, 03/09/2025 - 12:16

దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్‌'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.

శివ్‌జీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్‌లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్‌ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్‌లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్‌రూమ్‌ వరకు: అదానీ పోస్ట్ వైరల్

గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్‌నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్‌కేర్, గేమ్ రూమ్‌లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)