Breaking News

గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్‌ నిలిపేయాలని డిమాండ్‌..

Published on Thu, 04/18/2024 - 14:28

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు చివరకు కార్పొరేట్‌ రంగంలోనూ ప్రవేశించాయి. ఇరాన్‌-ఇ‍జ్రాయెల్‌ మధ్య యుద్ధ భయాలు  నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీలో నిరసనగళం వినిపించింది. గూగుల్‌ ఉద్యోగులు కంపెనీ క్లౌడ్‌ సీఈఓనే ఎదురించేస్థాయికి వెళ్లారు. ఏకంగా రూ.10వేల కోట్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. దాంతో చివరకు అలా నిరసనకు దిగిన ఉద్యోగులు అరెస్టయిన ఘటన ఇటీవల గూగుల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

హమాస్‌-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో తాజాగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ సెగ చివరకు కార్పొరేట్‌ సంస్థలను తాకింది. ప్రముఖ దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా కాలిఫోర్నియా కార్యాలయంలోని గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్‌ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ఇజ్రాయెల్ దేశంతో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే నిలిపేయాలని నిరసన గళం వినిపించారు. దాదాపు ఈ నిరసన 8 గంటలపాటు సాగింది. ఈమేరకు లైవ్‌లో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

డిమాండ్‌లో పాల్గొన్న ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్‌ లీవ్‌లో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా అక్కడి నుంచి ఏమాత్రం నిరసన విరమించుకోకపోవడంతో చర్యలు చేపట్టింది. ఉద్యోగుల వ్యవహారంతో చేసేదేమిలేక గూగుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

ఉద్యోగులు తీసిన వీడియోలో వారు కూర్చున్న గది ముందు ‘డ్రాప్‌నింబుస్‌’ బ్యానర్‌ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గతంలో గూగుల్‌ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు ‘ప్రాజెక్ట్ నింబుస్‌’. దాని విలువ 1.2 బిలియన్‌ డాలర్లు(రూ.10 వేలకోట్లు). అయితే ఆ దేశంతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ముస్లిం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు. వారిపై బెదిరింపులకు పాల్పడకూడదని, ఆ వ్యవహారాన్ని సమరస్యంగా పరిష్యరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి కంపెనీ ఘాటుగానే స్పందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ నిరసనలో పాల్గొన్ని దాదాపు 28 మ​ందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: భారత్‌లో సోలార్‌ సొల్యూషన్స్‌ అందిస్తున్న నం.1 కంపెనీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)