Breaking News

కేంద్రం దెబ్బకు దిగొచ్చిన గూగుల్‌

Published on Sat, 03/02/2024 - 19:25

సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన గూగుల్ అప్పుడే యాప్‌లను పునరుద్ధరించే (Restore) ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్‌'తో కంపెనీ అధికారులు సమావేశం జరగకముందే టెక్ దిగ్గజం ఈ చర్యకు పూనుకుంది.

గత శుక్రవారం గూగుల్ భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించి.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో వివాదానికి కారణమైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్‌లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ప్రముఖ యాప్‌లను తొలగించింది.

తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అన్‌అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని.. 

మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్‌కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)