Breaking News

దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు!

Published on Fri, 04/17/2026 - 11:42

దేశీయ బులియన్ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక అనుమతుల్లో జాప్యం కారణంగా భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి బంగారం, వెండి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. ఇప్పటికే దిగుమతి అయిన టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయాయి. ఈ పరిణామం అటు ఆభరణాల రంగాన్ని, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అసలేం జరిగింది?

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను ఇందులో పేర్కొంటుంది. గత ఏప్రిల్ 2025లో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ ప్రారంభంలోనే కొత్త ఉత్తర్వులు వస్తాయని బ్యాంకులు ఆశించినప్పటికీ ఇప్పటివరకు డీజీఎఫ్‌టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్ద క్లియరెన్స్ కోసం ఉంది.

‘మునుపటి సరుకులే క్లియర్ కానప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే బ్యాంకులు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి’ అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు.

సరఫరా కొరత - అక్షయ తృతీయపై ప్రభావం?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి కొనుగోలుదారుగా ఉన్న భారత్.. తన అవసరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుత దిగుమతుల నిలిపివేత వల్ల మార్కెట్‌లో భారీ సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ, ‘త్వరలోనే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో దిగుమతులు పునప్రారంభం కాకపోతే మార్కెట్‌లో ప్రీమియంలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.

వాణిజ్య లోటును తగ్గించే వ్యూహమా?

మరోవైపు, ఈ జాప్యం వెనుక ప్రభుత్వం ఆర్థిక వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కరెన్సీల్లో ఈ ఏడాది రూపాయి బలహీనంగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంది. ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ లోటును సమతుల్యం చేయడానికి విలాస వస్తువులైన బంగారం, వెండి దిగుమతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియంత్రిస్తుండవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!

Videos

మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు

లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)