Breaking News

పండక్కి ముందే.. పరుగులు పెట్టిన బంగారం!

Published on Fri, 11/06/2026 - 06:54

పండుగ సీజన్‌లో ధన్‌తేరాస్‌కి ముందు పసిడి జోరందుకుంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం గురువారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,200 పెరిగి రూ. 1,48,800కి చేరింది. అటు వెండి కూడా అదే బాటలో సాగింది. కేజీకి రూ. 1,500 పెరిగి రూ. 1,94,500 పలికింది. శుక్రవారం ధన్‌తేరాస్‌ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్లు, స్టాకిస్టులు కొనుగోళ్లు జరపడంతో పసిడి, వెండి ధరలు పెరిగినట్లు ట్రేడర్లు తెలిపారు.

ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా డిమాండ్‌ నెలకొనడం కూడా ఇందుకు దోహదపడినట్లు వివరించారు. గతేడాది ధన్‌తేరాస్‌ రోజున (అక్టోబర్‌ 18) బంగారం ధర. 1,32,400గా, వెండి ధర రూ. 1.7 లక్షలుగా నమోదైంది. అప్పటి నుంచి పసిడి రేటు 13 శాతం పెరిగిందని, దేశీయంగా ధర రూ.1.40–1.48 లక్షల మధ్య తిరుగాడుతోందని మోనార్క్‌ పీఎంఎస్‌ అసిస్టెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ ధృవ్‌ జోగ్లేకర్‌ తెలిపారు.  మరోవైపు, అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి 65.12 డాలర్లు (సుమారు 2 శాతం) పెరిగి 4,125.25 డాలర్లకు చేరింది. వెండి కూడా 1 శాతం పెరిగి 52.73 డాలర్లు పలికింది.

ఇదీ చదవండి: రూ.2,100 కోట్ల లగ్జరీ హోటల్.. చివరకు అందుకే అమ్మేశారట!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)