Breaking News

పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు

Published on Wed, 06/10/2026 - 21:02

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం​ (24 క్యారెట్లు) ఏకంగా రూ.4300 క్షీణించి రూ.1,49,010లకు దిగివచ్చింది. అలాగే ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,950 తగ్గి రూ.1,36,600లకు వచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాటపట్టిన బంగారం ధరలు క్రితం ఒక్కసారిగా ఎగిసి మళ్లీ ఈరోజు అంతకు మించి భారీగా పతనమమ్యాయి. ఒక్కరోజులో పసిడి ధరలు ఈ స్థాయిలో పతనమవడానికి ప్రధాన కారణాలు ఏంటన్నది ఈ కథనంలో చూద్దాం.

తాజా మార్కెట్‌ డేటా పరిశీలిస్తే, ఈరోజు (జూన్‌ 10) బంగారం ధరలు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడమే అని స్పష్టంగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో కూడా అదే ప్రభావం ప్రతిబింబించింది.

ఎందుకు పడిపోయాయి?

గ్లోబల్‌ గోల్డ్‌లో భారీ అమ్మకాలు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ధరలు 2%–3% వరకు పడిపోయాయి. దీంతో భారత మార్కెట్లో ఎంసీఎక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా దాదాపు 2% క్షీణించి రూ.1.49 లక్షల స్థాయికి దిగివచ్చాయి.

అమెరికా ద్రవ్యోల్బణ డేటాపై ఆందోళన
అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల ముందు ట్రేడర్లు భారీగా ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్‌ వడ్డీ రేట్లను ఎక్కువకాలం పైనే ఉంచవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడి తెచ్చాయి.

డాలర్‌, ట్రెజరీ ఈల్డ్స్‌ బలపడటం
అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ బలపడటంతో వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఈ అంశం కూడా ధరల పతనాన్ని వేగవంతం చేసింది.

రికార్డు స్థాయిల తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌
ఇటీవలి వారాల్లో బంగారం చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకుంది. దీంతో పెద్ద ఫండ్‌లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)