Breaking News

మార్చిలో జోరుగా  పసిడి దిగుమతులు

Published on Sun, 04/20/2025 - 03:08

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా 192 శాతం అధికంగా 4.47 బిలియన్‌ డాలర్ల (రూ.38వేల కోట్లు సుమారు) విలువైన పసిడి దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలో దిగుమతులు 1.53 బిలియన్‌ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే బంగారం దిగుమతుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది.

 విలువ పరంగా వృద్ధి కనిపించగా, పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులు 2023–24తో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 27 శాతం ఎగసి 58 బిలియన్‌ డాలర్లకు (రూ.4.99 లక్షల కోట్లు సుమారు) చేరాయి. 2023–24 సంవత్సరంలో పసిడి దిగుమతులు 45.54 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. పరిమాణం పరంగా 757.15 టన్నుల బంగారం గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయింది.

2023–24లో ఇది 795.32 టన్నులుగా ఉండడం గమనించొచ్చు. దిగుమతి పరిమాణం తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో విలువ పరంగా వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 62 శాతం తగ్గగా (విలువ పరంగా), జనవరిలో 41 శాతం, 2024 డిసెంబర్‌లో 55 శాతం చొప్పున పెరిగాయి. సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తూ పెట్టుబడులు పెట్టే ధోరణి పెరగడం దిగుమతులకు మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు పెరిగిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.  



వాణిజ్య లోటుకు ఆజ్యం 
బంగారం దిగుమతుల విలువ పెరగడం దేశ వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీసింది. మార్చి నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్‌ డాలర్ల లోటుతో ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకడం గమనార్హం. 
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)