Breaking News

భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!

Published on Fri, 05/19/2023 - 16:02

సాక్షి,ముంబై: మండు వేసవిలో  చల్లటి కబురు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన  పసిడి ధర శుక్రవారం  మరింత తగ్గి మహిళలకు గుడ్‌ న్యూస్ అందించింది.  దేశీయ మార్కెట్‌లో  తులం బంగారం ధర 62 వేల దిగువనే కొనసాగుతోంది. ఫ్యూచర్స్  మార్కెట్‌లో 10 గ్రాములు రూ.60,000 దిగువన ట్రేడవుతోంది.  (అమెజాన్‌ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు)

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ 300 తగ్గి  రూ.55800గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల  ధర రూ.330 తగ్గి  రూ.60870గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 1,964.4 డాలర్లుగా ఉంది.

అటు వెండి ధరకూడా స్వల్పంగా 200 తగ్గి కిలో వెండి 74300గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రూ 78 వేలుగా ఉంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 61,020, 22 క్యారెట్ (10 గ్రాములు) రూ. 55,950.  చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 61,360 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 56,250. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉంది. (గూగుల్‌ సీఈవో ప్రైమరీ ఫోన్‌ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)

స్వల్పకాలిక ప్రాతిపదికన బంగారంపై సెంటిమెంట్ ఒక వారం వ్యవధిలో బుల్లిష్ నుండి బేరిష్‌కు మారిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర తగ్గడానికి రెండు అంశాలు కారణమని భావించారు. జూన్ 1 నాటికి తమ రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్ట్ అవుతుందనే ఆందోళన నెలకొంది. అయితే చర్చలు అర్థవంతంగా ఉన్నాయని  అధ్యక్షుడు బిడెన్ హామీ ఇచ్చినప్పటికీ డెట్ సీలింగ్ చర్చలు ఫెడ్‌ రేట్లను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించనున్నవడ్డీరేట్ల ఆధారంగా పసిడి ధరల కదలికలు ఉండనున్నాయి.  (Adani-Hindenburg Row: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)