Breaking News

వెండి, పసిడి అదే పరుగు..

Published on Thu, 01/29/2026 - 00:51

న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్‌ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా బుధవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కిలో ధర మరో రూ. 15,000 పెరిగి ఇంకో కొత్త ఆల్‌ టైం గరిష్టం రూ. 3,85,000కి ఎగిసింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,000 మేర పెరిగి రూ. 1,71,000కు ఎగిసింది. 

బంగారం, వెండి రేట్లు పటిష్టంగా ర్యాలీ చేస్తున్నాయని, ప్రతీ రోజు కొత్త గరిష్టాలకు ఎగదోసేందుకు బుల్స్‌కి కొత్త కారణాలు లభిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరంగా అనిశ్చితులు మొదలైన అంశాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి రేట్లకు రెక్కలొస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 74.57 డాలరు పెరిగి 5,256.35 డాలర్లకు చేరింది. 

ఇంట్రాడేలో 130.13 డాలర్లు ఎగిసి 5,311.38 డాలర్ల స్థాయిని కూడా తాగింది. అటు సిల్వర్‌ ధర 0.12 శాతం పెరిగి 112.22 డాలర్లకు చేరింది. అటు ఫ్యూచర్స్‌ మార్కెట్‌ కామెక్స్‌లో గోల్డ్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఒక దశలో దాదాపు 200 డాలర్లు పైగా పెరిగి 5,344.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఇక సిల్వర్‌ సైతం సుమారు పది డాలర్లకు పైగా పెరిగి ఒక దశలో 116.11 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ. 1,75,848 వద్ద, సిల్వర్‌ మార్చి కాంట్రాక్టు రూ. 3,85,200 వద్ద ట్రేడయ్యింది. అనిశ్చితికి, టారిఫ్‌ బెదిరింపులు, ఫెడరల్‌ రిజర్వ్‌ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాల్లాంటివి భౌగోళిక–రాజకీయ అనిశ్చితికి దారితీస్తూ, సిల్వర్, గోల్డ్‌ ధరలను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.  

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు